అనంతపురం జిల్లాలోని రాయదుర్గంలో భారీ వర్షం కురిసింది. జిల్లాలోని బొమ్మనహల్ మండలంలో అత్యధికంగా 104.6 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షానికి పలు ప్రభుత్వ కార్యాలయాలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. సుమారు 5 వేల ఎకరాలకు పైగా పంటలకు నష్టం వాటిల్లిందని... పత్తి, వరి, మిరప రైతులు ఆవేదన చెందుతున్నారు. వర్షానికి రోడ్లపై నీరు చేరి వాహన చోదకులు ఇబ్బందులు పడ్డారు.
అనంతపురంలో భారీ వర్షం...అన్నదాతకు భారీ నష్టం - rayadurgam lo bhari varshalu
అనంతపురం జిల్లాలోని రాయదుర్గంలో భారీ వర్షం కురిసింది. వాన బీభత్సానికి పంటలు పూర్తిగా నాశనమయ్యాయి. రహదారులపై నీరు చేరి వాహన చోదకులు ఇబ్బందులు పడ్డారు.
వర్షానికి నీటమునిగిన పంటలు
ఇదీ చదవండి: