ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లాలో కురిసిన భారీ వర్షం… రోడ్లన్నీ జలమయం

అనంతపురం జిల్లాలో పలుచోట్ల కురిసిన వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. మురుగునీరు రోడ్లపైన ప్రవహించడం వల్ల వాహనదారులు ఇక్కట్లు పడ్డారు. పలు కాలనీలు నీటమునిగాయి.

heavy rains in ananthapur district and roas are filled with drainage water
భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయం

By

Published : Aug 10, 2020, 3:21 PM IST

అనంతపురం జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచి వంకలను తలపించాయి.

తాడిపత్రిలో..

తాడిపత్రి నియోజకవర్గంలో ఆదివారం భారీ వర్షం పడింది. పెద్దపప్పూరు, పెద్దవడుగురు, యాడికి మండలాలతో పాటు తాడిపత్రి పట్టణంలో రెండు గంటల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. తాడిపత్రి పట్టణంలోని పలు వీధుల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజి బ్లాక్ అవ్వడం వల్ల రోడ్లపైన నీళ్లు నిలిచాయి.

గుంతకల్లులో..

గుంతకల్లులో మధ్యాహ్నం మూడు గంటల సమయం నుంచి ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురిసింది. పట్టణంలోని ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. పాత బస్టాండ్​, సీపీఐ కాలనీ, రాజేంద్ర నగర్ వంటి పలు కాలనీల్లో వర్షం నీరు రోడ్ల మీదుగా ప్రవహించాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు.

ఇదీ చదవండి :

జమ్మలమడుగులో భారీ వర్షం... లోతట్టు ప్రాంతాలు జలమయం

ABOUT THE AUTHOR

...view details