పుట్టపర్తిలో భారీ వర్షం.. జలమయమైన రహదారులు - ananthapuram
పుట్టపర్తిలో కురిసిన భారీ వర్షానికి రహదారులు, విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి. కుంటలు, చెరువుల్లోకి నీరు చేరాయి. ఖరీఫ్‌కు ముందు ఇలా వర్షం కురవడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పుట్టపర్తిలో భారీ వర్షం... జలమయమైన రహదారులు
పుట్టపర్తిలో కురిసిన భారీ వర్షానికి కుంటలు, చెరువుల్లోకి నీరు చేరాయి. ఈదురు గాలులతో వర్షం పడటంతో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. పలు చోట్ల రహదారులు దెబ్బతిన్నాయి. పట్టణంలోని దేవాలయాల్లోకి వర్షపు నీరు చేరాయి. కొత్త చెరువు రైల్వే వంతెన కింద నీరు చేరడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే భారీ వర్షం కురవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.