ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉరవకొండ.. భారీ వర్షాలతో నిండుకుండ! - భారీ వర్షం

అనంతపురం జిల్లా,ఉరవకొండ నియోజకవర్గంలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. నక్కలపల్లి దారి మధ్యలో ఉన్న వంక ప్రవాహం పెరిగి పొలాలకు వెళ్లిన రైతులు,కూలీలు ఐదుగురు చిక్కుకుపోగా గ్రామస్థులు రక్షించి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.

heavy rain
భారీ వర్షానికి...రైతుల ఇబ్బందులు

By

Published : Jul 19, 2021, 9:11 AM IST

అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి చెరువులు, కుంటలు జల కళను సంతరించుకున్నాయి. రోడ్లు, వీధులన్నీ జలమయం అయ్యాయి. భారీ వర్షం కారణంగా బేలుగుప్ప మండలంలో వంకలు, కుంటలు పొంగిపొర్లాయి.

నక్కలపల్లిలో పొలాలకు వెళ్లిన రైతులు, కూలీలు దారి మధ్యలో ఉన్న వంకను దాటుతుండగా ఒక్కసారిగా ప్రవాహం పెరిగి.. ఐదుగురు చిక్కుకుపోయారు. గ్రామస్థులు వారిని రక్షించి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షం కురిసిందని గ్రామస్తులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details