ఎడతెరిపిలేని వర్షాలకు కొట్టుకుపోయిన వంతెన - కొట్టుకుపోయిన వంతెన
అనంతలో వర్షాలకు వంతెన కొట్టుకుపోయింది. ప్రత్యామ్నాయ మార్గం లేక నదిలోనే రాకపోకలు సాగిస్తున్నారు ప్రజలు. ప్రవాహ ఉద్ధృతి పెరిగితే ప్రమాదం తప్పదంటున్నారు గ్రామస్థులు. వంతెన నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఆ గ్రామానికి ఉన్నది ఒకటే దారి...ఎడతెరిపిలేని వర్షలకు ఉన్న ఆ ఒక్క దారి అధ్వాన స్థితికి చేరడంతో స్థానికులకు ఇబ్బందులు తప్పడం లేదు.అనంతపురం జిల్లా ధర్మవరం మండలం కనంపల్లిలో దాదాపు2వందల కుటుంబాలు నివసిస్తున్నాయి.గ్రామం నుంచి వేరే ఊర్లకు వెళ్లాలంటే చిత్రావతి నదిపై ఉన్న వంతెన మార్గంలో పోతుల నాగేపల్లి మీదుగా రాకపోకలు జరిగేవి.ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నది ఉద్ధృతంగా ప్రవహించడంతో...మట్టి వంతెన కొట్టుకు పోయింది.2 గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోగా...రైతులు,విద్యార్థులు నదిలోనే రాకపోకలు చేస్తున్నారు.అధికారులు పట్టించుకోని వంతెన నిర్మాణం చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.