అనంతపురం జిల్లా ఉరవకొండ, విడపనకల్లు మండలాల్లో శనివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగిపొర్లాయి. వంకలు ఉధృతంగా ప్రవహించాయి. భారీ వర్షంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.
Heavy Rains : అనంతలో భారీ వర్షం.. రైతన్నల హర్షం.. - అనంతపురం జిల్లాలో పంటపొలాలు
అనంతపురం జిల్లాలోని పలు ప్రాంతల్లో శనివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. రబీ సీజన్ లో మంచి వర్షాలు కురుస్తుండడంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అనంతలో భారీ వర్షం
అయితే.. ఖరీఫ్ లో వర్షాలు లేక పంటలు కోల్పోయిన రైతన్నలు.. రబీ సీజన్ లో మంచి వర్షాలు కురుస్తుండడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. అటు.. ఉరవకొండ మండలం బుదగవి చెరువు నిండింది. గతంలో ఎన్నడూ లేని విధంగా చెరువు నిండడంతో జలకళ సంతరించుకుంది.
ఇదీ చదవండి : MP lads funds: ఎంపీ లాడ్స్ నిధులపై వివరణ ఇవ్వాలని ఏపీకి కేంద్రం లేఖ