అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం దురదకుంటకి చెందిన రామక్కకు 3 రోజుల నుంచి జ్వరంగా ఉంది. ఆమె కుమారుడు రవి తల్లితో గురువారం ఆటోలో వచ్చారు. లాక్‌డౌన్ కారణంగా ఆటో కళ్యాణదుర్గంలోకి రాలేదు. దీంతో మాతృమూర్తిని ఎత్తుకుని ప్రైవేట్ ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. వైద్యులు అందుబాటులో లేకపోవటంతో...చివరకి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించుకుని వెనుదిరిగారు.
కడుపులో మోసిన తల్లిని... వీపున మోసిన తనయుడు - ananthapuram lockdown news
నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లిని.. కుమారుడు వీపుపైన ఎత్తుకుని రెండు గంటల పాటు వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. మండుతున్న ఎండలో ఆ తనయుడు పడ్డ వేదన చూపరులను కలిచివేసింది. ఈ ఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో చోటుచేసుకుంది.
కళ్యాణదుర్గంలో తల్లి వైద్యం కోసం తనయుడి తపన
Last Updated : May 1, 2020, 10:19 AM IST