అనంతపురం జిల్లా పెనుకొండ మండలం గుట్టూరు కూడలి వద్ద 44వ జాతీయ రహదారిపై.. కియా ఇండస్ట్రియల్ ఏరియా ఇన్ఛార్జ్ ఎస్సై వెంకటరమణ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. కర్ణాటక నుంచి రాష్ట్రంలోకి వచ్చిన ఓ కారులో నుంచి ప్రయాణికులు దిగి పారిపోతుండటంతో.. వారిని అదుపులోకి తీసుకొని కారును తనిఖీలు చేయగా.. సుమారు 50 వేల విలువైన గుట్కాలు పట్టుబడ్డాయి. వీటిని కర్ణాటకలోని బాగోపల్లి చక్బలాపూర్, బెంగళూరు ప్రాంతాల నుంచి తీసకొచ్చి కియా పరిశ్రమ సమీపంలో పలు దుకాణదారులకు అమ్ముతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో నలుగురు నిందితులను అరెస్టు చేసి.. 5 సెల్ఫోన్లు, కారును సీజ్ చేసినట్లు పెనుకొండ డీఎస్పీ మహబూబ్ బాషా వివరించారు. గుట్కా ముఠాను అరెస్టు చేసిన పోలీసులను ఆయన అభినందించారు.
50 వేల విలువైన గుట్కా స్వాధీనం.. నలుగురు అరెస్ట్ - గుట్టూరు గుట్కా స్వాధీనం
అనంతపురం జిల్లా గుట్టూరు కూడలి వద్ద కియా ఇండస్ట్రియల్ ఏరియా పోలీసులు చేపట్టిన వాహనాల తనిఖీలో గుట్కాలు పట్టుబడ్డాయి. ఓ కారులో నుంచి ప్రయాణికులు దిగి పరుగు తీస్తుండగా వారిని అదుపులోకి తీసుకొని.. కారులో సోదాలు నిర్వహించగా.. నిషేధిత గుట్కా పట్టుబడింది.
గుట్కా ముఠా అరెస్టు