నెలాఖరులోగా వేరుశనగ విత్తనాల పంపిణీ ప్రారంభిస్తామని మంత్రి శంకరనారాయణ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలోని శ్రీ సత్యసాయి రైతు పరస్పర సహయసహకార పరిమితి సమాఖ్య కేంద్రంలో సేకరించిన విత్తన వేరుశనగకాయలను మంత్రి పరిశీలించారు.
వేరుశనగ ఉత్పత్తిలో అనంతపురం జిల్లా దేశంలోనే మొదటి స్థానంలో ఉందని మంత్రి పేర్కొన్నారు . ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయం సాగాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కృత నిశ్చయంతో ఉన్నారన్నారు.పెనుకొండ మండలంలోని రైతు సమాఖ్య కేంద్రంలోనే 4వేల క్వింటాళ్ల నాణ్యమైన విత్తనాలను సేకరించినట్టు వివరించారు.