ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిలమత్తూరులో వేరుశనగ రైతుల ధర్నా

అనంతపురం జిల్లా చిలమత్తూరులో వేరు శనగ విత్తనాల కోసం రైతులు నిరసన చేపట్టారు. విత్తనాలు ఇవ్వడంలో అధికారుల అలసత్వానికి ఆగ్రహం వ్యక్తం చేశారు.

By

Published : Jun 18, 2019, 10:45 PM IST

చిలమత్తూరులో వేరుశనగ రైతుల ధర్నా

చిలమత్తూరులో వేరుశనగ రైతుల ధర్నా

అనంతపురం జిల్లా చిలమత్తూరులో వేరు శనగ విత్తనాల కోసం రైతులు ఆందోళనకు దిగారు. మూడు రోజుల నుంచి జిల్లాలో వేరుశెనగ విత్తన పంపిణీ జరుగుతోంది... అయితే సర్వర్ల మొరాయింపు వల్ల చాలా చోట్ల రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇవాళ చిలమత్తూరులోనూ ఈ సమస్యే తలెత్తింది. ఉదయం నుంచి రైతులు క్యూలైన్లో నిల్చున్నా సర్వర్ల సమస్యతో విత్తన పంపిణీ ముందుకు సాగలేదు. దీంతో విసిగిపోయిన రైతులు రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. రైతుల ఆందోళనతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రైతులకు సర్దిచెప్పారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details