Grandfather and Grandson Death: అనంతపురం జిల్లా యల్లనూరు మండలం లక్షుంపల్లిలో విషాదం నెలకొంది. తాడిమర్రి మండలం నాయనపల్లి గ్రామానికి చెందిన గంగన్న, ఆయన మనవడు గౌతమ్.. గ్రామ సమీపంలోని చిత్రావతి నదిలో గొర్రెలను శుభ్రపర్చడానికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో గౌతమ్ కాలు నదిలోని ఇసుకలో చిక్కుకుపోవటంతో.. కాపాడేందుకు గంగన్న వెళ్లి ప్రమాదవశాత్తు ఇద్దరు నీటిలో మునిగి మరణించారు. గ్రామస్థులు గమనించి మృతదేహాలను బయటికి తీశారు.
Death: అనంతపురంలో విషాదం... రక్షించబోయి తాత.. నీళ్లలో మునిగి మనవడు మృతి - grandfather and grandson death
గొర్రెలను శుభ్రపర్చేందుకు వెళ్లి తాత, మనవడు మృతి
10:36 March 06
ఎల్లనూరు మండలం లక్షుంపల్లిలో ఘటన
మరణవార్త విని మృతుల కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:
Last Updated : Mar 6, 2022, 12:45 PM IST