ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

టీచర్ మల్లేశ్‌ ఆత్మహత్యాయత్నం- వైసీపీ తీరుపై భగ్గుమన్న ఉపాధ్యాయ సంఘాలు

Government Teacher Suicide Attempt Issue: తన చావుకు సీఎం జగనే కారణమంటూ లేఖ రాసి ఉపాధ్యాయుడు ఆత్మహత్యకు యత్నించిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. దీంతో సీఎం జగన్ ఇకనైనా కళ్లు తెరవకపోతే అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలను కలుపుకుని రాష్ట్ర స్థాయి ఉద్యమం చేపడతామని ఉపాధ్యాయులు హెచ్చరించారు.

Government_Teacher_Suicide_Attempt_Issue
Government_Teacher_Suicide_Attempt_Issue

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 11, 2023, 9:08 AM IST

Government Teacher Suicide Attempt Issue: అనంతపురం జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మల్లేశ్ ఆత్మహత్యకు యత్నించడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. వైసీపీ ప్రభుత్వం సీపీఎస్ రద్దు హామీ నెరవేర్చకపోగా సక్రమంగా జీతాలు ఇవ్వడంలేదనే ఆవేదనతో పురుగుల మందు తాగారు. సీఎం జగనే తన చావుకు కారణమంటూ 5 పేజీల లేఖ రాసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. జగన్‌పై ఉన్న పిచ్చి అభిమానమే తన పాలిట మరణ శాసనం అయ్యిందంటూ లేఖలో పేర్కొన్నారు. మల్లేశ్‌ ఆత్మహత్యా యత్నానికి వైసీపీ ప్రభుత్వమే కారణమంటూ ఉద్యోగ సంఘాలు మండిపడ్డాయి.

UTF Protest in Ap : సీపీఎస్​ రద్దు కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల నిరసనలు..

Govt Teacher Suicide Attempt in Anantapuram District:అనంతపురం జిల్లాలోని విడపనకల్లు మండలం పాల్తూరు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మల్లేశ్‌ సీపీఎస్ రద్దు చేయలేదన్న ఆవేదనతో ఆత్మహత్యకు యత్నించడం సంచలనం రేపింది. సీపీఎస్ రద్దు, జీతాలు సక్రమంగా రాకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురైన మల్లేశ్‌ పెన్న అహోబిలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు.

Teacher Commits Suicide Attempt for CPS Cancellation: తన చావుకు సీఎం జగన్మోహన్ రెడ్డి కారణమంటూ 5 పేజీల లేఖ రాశారు. పురుగుల మందు తాగి సిట్రజిన్ టాబ్లెట్లు వేసుకున్న మల్లేశ్​ను కుటుంబసభ్యులు గమనించి ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అనంతపురం తీసుకువెళ్లారు. ప్రస్తుతం మల్లేశ్ పరిస్థితి విషమంగా ఉంది. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Teachers Unions Boycotted GAD Meeting in Vijayawada: జీపీఎస్‌పై సమావేశం.. బహిష్కరించిన ఉపాధ్యాయ సంఘాలు

Teacher Suicide Attempt: ప్రభుత్వ ఉపాధ్యాయుడు మల్లేశ్ ఆత్మహత్యాయత్నానికి సీఎం జగన్‌, వైసీపీ ప్రభుత్వమే కారణమని ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. రాష్ట్రంలో అనేక మంది ఉపాధ్యాయులు ఇదే పరిస్థితిలో ఉన్నారని మండిపడ్డారు. మల్లేశ్‌ ఆత్మహత్యాయత్నం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మల్లేశ్‌ ఆత్మహత్యాయత్నం చేసుకునే స్థితికి ప్రభుత్వం తీసుకురావడంపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సీఎం జగన్ ఇకనైనా కళ్లు తెరవకపోతే అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలను కలుపుకుని రాష్ట్ర స్థాయి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

"ప్రభుత్వ ఉపాధ్యాయుడు మల్లేశ్ ఆత్మహత్యాయత్నం దురదృష్టకరం. మల్లేశ్ ఆత్మహత్యాయత్నానికి సీఎం జగన్‌, వైసీపీ ప్రభుత్వమే కారణం. రాష్ట్రంలో అనేక మంది ఉపాధ్యాయులు ఇదే పరిస్థితిలో ఉన్నారు. మల్లేశ్‌ ఆత్మహత్యాయత్నం చేసుకునే స్థితికి వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇప్పటికైనా వైసీపీ సర్కారు సీపీఎస్ రద్దు హామీ నెరవేర్చి సక్రమంగా జీతాలు చెల్లించాలని కోరుతున్నాం. సీఎం జగన్ ఇకనైనా కళ్లు తెరవకపోతే అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలను కలుపుకుని రాష్ట్ర స్థాయి ఉద్యమం చేపడతాం."- ఉపాధ్యాయ సంఘాలు

CM Jagan Comments on CPS in APNGO Meeting: "సీపీఎస్ రద్దుపై మాట తప్పే ఉద్దేశం ఉంటే.. జీపీఎస్ తెచ్చేవాళ్లం కాదు"

ABOUT THE AUTHOR

...view details