అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కసాపురంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో సుమారు 100 గోవులు సంరక్షించబడుతున్నాయి. పశువుల కాపరికి మాయమాటలు చెప్పి 2 గోవులను కబేళాలకు తీసుకుపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆలయ అధికారులు వెంటనే స్పందిచటంతో గోవులు సురక్షితంగా కబేళా నుంచి బయటపడ్డాయి. గోశాలలో వంద ఆవులు, వాటికి దూడలు ఉన్నాయి. వాటి నిర్వహణ భారం కావటం.. తగిన స్థలం లేకపోవటంతో ఎద్దులను రైతులకు ఇచ్చేందుకు ఆలయ అధికారులు శ్రీకారం చుట్టారు. రైతులు తమకు కావాల్సిన పశువుల కోసం పట్టాదారు పాసు పుస్తకం, వారి చిరునామా తీసుకుని ఇస్తున్నారు. ఆవుల కాపరి గోపాల్‌కు గ్రామానికి చెందిన మణి, దావుద్ అనే ఇరువురు ఆలయ అధికారికి చెప్పామంటూ.. రెండు గోవులను కావాలని కోరటంతో అధికారులకు తెలపకుండ వాటిని అప్పగించాడు. పశువులను కర్నూలు జిల్లా మద్దికెర గ్రామంలోని కబేలదారులకు కొంత సొమ్ముకు విక్రయించారు. గోశాలలో ఉన్న పశువులకు ఎర్రచందనం, బొట్టు పెడుతూ ఉంటారు. మద్దికెర గ్రామస్థులు వాటిని గుర్తించి... ఆలయ అధికారులకు సమాచారమిచ్చారు. అధికారులు వాటిని వెంటనే వెనక్కు తీసుకువచ్చారు. గోశాల నిర్వహణపై నిర్లక్ష్యం చేస్తున్నారని అధికారులపై భక్తులు విమర్శలు చేస్తున్నారు. కబేళాకు అమ్ముకున్న దావూద్, మణిపై కసాపురం పోలీస్ స్టేషన్లో అధికారులు ఫిర్యాదు చేశారు. కాపరిని సస్పెండ్ చేశారు.
గోశాలలోని ఆవులకూ రక్షణ కరువే..! - guntakal
ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయ పరిధిలోని గోశాలలో ఉన్న ఆవులకు రక్షణ కరువైంది. తాజాగా రెండు గోవులను కబేలాకు తరలించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
గోశాల