ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గాండ్లపెంటలో ఘనంగా గోమాత కల్యాణోత్సవం

By

Published : Feb 20, 2021, 2:13 PM IST

అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలంలో గోమాత కల్యాణోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలతో కళకళలాడాలని ప్రార్థించారు. కల్యాణానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

gomata kalyanam at gandlapenta in ananthapur
గాండ్లపెంటలో ఘనంగా గోమాత కల్యాణోత్సవం

గాండ్లపెంటలో ఘనంగా గోమాత కల్యాణోత్సవం

సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలతో కళకళలాడాలని కోరుతూ.. అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలంలో గోమాత కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. సనాతన హైందవ ధర్మాన్ని అనుసరిస్తూ సృష్టిలోని ప్రతి ప్రాణిలో దైవత్వాన్ని చూడడం ద్వారా శాంతి నెలకొంటుందని.. సేవా భారతి ప్రతినిధులు తెలిపారు.

గోవును దేవతగా ఆరాధించే మనదేశంలో గోమాత కల్యాణాన్ని నిర్వహిస్తూ గోమాత విశిష్టత తెలియజేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. వేడుకకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వధూవరుల స్థానంలో ఉన్న ఆవు, ఎద్దులను పూజించారు.

ABOUT THE AUTHOR

...view details