అనంతపురం జిల్లా ధర్మవరం మండలం వెంకట తిమ్మాపురం గ్రామానికి చెందిన అమల.. కనగానపల్లి మండలంలోని నర్సంపల్లిలోని తన పుట్టింటికి కుమార్తె శ్రీవిద్యతో కలిసి వెళ్ళింది. అమల సోదరుడు రమేష్.. పొలం నుంచి ట్రాక్టర్‌పై ఇంటికి వస్తుండగా... మేనమామను చూసిన శ్రీవిద్య ట్రాక్టర్‌కు ఎదురు వెళ్ళింది. ఇది గమనించని రమేష్... చిన్నారిని ఢీ కొట్టటంతో అక్కడికక్కడే మృతి చెందింది. శ్రీ విద్య తల్లిదండ్రుల ఫిర్యాదుతో స్థానిక పోలీసులు రమేష్‌పై కేసు నమోదు చేశారు. శవ పరీక్ష నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.
నర్సంపల్లిలో విషాదం... ట్రాక్టర్ ఢీకొని చిన్నారి మృతి - child death in ananthapuram district
అనంతపురం జిల్లా నర్సంపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. ట్రాక్టర్ ఢీ కొని 14 నెలల చిన్నారి మృతి చెందింది. ఊహించని ఈ ఘటనతో బాలిక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ట్రాక్టర్ ఢీ కొని చిన్నారి మృతి