ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాయితీ విత్తుపై దళారుల కన్ను... అధికారుల చొరవతో ఆట కట్టు... - formers

అనంతపురం జిల్లాలో వేరుశనగ విత్తన పంపిణీ అస్తవ్యస్తంగా  మారింది. వ్యవసాయ శాఖ సిబ్బంది చేతివాటంతో...రైతులకు అందాల్సిన వందల క్వింటాళ్లు నల్లబజారుకు తరలిపోతున్నాయి. దాదాపు కోటిన్నర రూపాయల విలువైన అక్రమ నిల్వలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

problems-for-seeds

By

Published : Jul 22, 2019, 2:02 PM IST

రాయితీ విత్తుపై దళారుల కన్ను... అధికారుల చొరవతో ఆట కట్టు...
అనంతపురం జిల్లాలో రైతుల విత్తన వెతలు తీరలేదు. అధికారులు పట్టించుకోని పరిస్థితి. రాయితీ విత్తనం మాత్రం నల్లబజారుకు యథేశ్చగా తరలిపోతోంది. ఖరీఫ్‌లో 3 లక్షల క్వింటాళ్ల పంపిణికి ప్రభుత్వం నిర్ణయించింది. బహిరంగ మార్కెట్లో వేరుశనగ విత్తనం ధర అధికంగా ఉందని గ్రహించిన రైతులు రాయితీ విత్తు కోసం ఎగబడ్డారు. అధికారుల ప్రణాళిక వైఫల్యంతో పంపిణీ కేంద్రాల వద్ద క్యూలైన్లు, ఘర్షణపూరిత వాతావరణాలు కనిపించాయి. రైతుల ఇంతగా అవస్థ పడుతుంటే కొందరు అక్రమార్కులు మాత్రం రాయితీ విత్తనాన్ని పక్కదారి పట్టించారు.

కాసుల కక్కుర్తితో వ్యవసాయ శాఖ అధికారులు తెలివిగా రాయితీ విత్తనాన్ని పక్కదారి పట్టించారు. నల్లరేగడి నేలలున్న ప్రాంత రైతులకు వేరుశనగ విత్తనం ఇప్పించి... వాటిని దళారులకు విక్రయించేలా పావులు కదిపారు. వీరి వద్ద తక్కువ ధరకు కొన్న వ్యాపారులు ఆ విత్తనాలను కర్ణాటక తరలిస్తున్నారు. అవసరం ఉన్న స్థానిక రైతులకు అధిక ధరకు విక్రయిస్తున్నారు.

విషయం తెలుసుకున్న వ్యవసాయ, విజిలెన్స్, పోలీసు అధికారులు అక్రమ నిల్వ గుట్టు రట్టు చేస్తున్నారు. విడపనకల్లు మండలం వేల్పమడుగులో ఏకంగా 664 బస్తాలు పట్టుకున్నారు. నిన్న 150 క్వింటాళ్లకుపైగా స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యాపారులపై కేసులు నమోదు చేశారు. ఇప్పటి వరకు కోటి 7లక్షల రూపాయల విలువైన విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు.

అక్రమ నిల్వలపైనా కొరడా ఝుళిపిస్తామంటున్న జిల్లా కలెక్టర్‌...విత్తనాల పంపిణీలో అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details