ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

FOOD POISON: ధర్మవరంలో కేక్ తిని 20 మందికి అస్వస్థత - people ate cake fell ill

అనంతపురం జిల్లా ధర్మవరం వైకాపా నేత పుట్టినరోజు వేడుకల్లో అపశృతి జరిగింది. పుట్టినరోజు కేకు తిన్న సుమారు 20 మంది ఫుడ్ పాయిజన్​తో అస్వస్థతకు గురయ్యారు.

FOOD POISON
ధర్మవరంలో కేక్ తిని 20 మందికి అస్వస్థత

By

Published : Jul 10, 2021, 7:01 PM IST

Updated : Jul 10, 2021, 7:51 PM IST

అనంతపురం జిల్లా ధర్మవరంలో వైకాపా కౌన్సిలర్ రమణ పుట్టినరోజు సందర్భంగా కేకు తిన్న 20 మంది అస్వస్థతకు గురయ్యారు. స్థానికంగా మూడో వార్డు కౌన్సిలర్ రమణ పుట్టినరోజును పురస్కరించుకుని శాంతినగర్​లో ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొన్న వారికి కేకు పంచారు.

దానిని తిన్న గంటలోనే పలువురికి కడుపులో తిప్పటం, వాంతులతో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వృద్ధులు, చిన్నారులు అస్వస్థతకు గురైన వారిలో అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. కేకు తిన్న కౌన్సిలర్ రమణ స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు. ఫుడ్ పాయిజన్ కావడం వల్లే పలువురు అనారోగ్యానికి గురయ్యారని పట్టణ పోలీసులు పేర్కొన్నారు.

Last Updated : Jul 10, 2021, 7:51 PM IST

ABOUT THE AUTHOR

...view details