అనంతపురం జిల్లా యాడికి మండలం బోయరెడ్డిపల్లి సమీపంలోని పెన్నా సిమెంట్ కర్మాగారంలో అగ్నిప్రమాదం జరిగింది. కర్మాగారంలోని ఎల్వన్ యూనిట్లో బొగ్గు వేడి చేసే ప్రాంతంలో గ్యాస్ లీకై ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ప్రమాద సమయంలో... అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. అప్రమత్తమైన కర్మాగారం సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన సిబ్బంది అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోయినప్పటికీ... భారీగా ఆస్తినష్టం జరిగినట్లు కర్మాగార సిబ్బంది తెలిపారు.
FIRE ACCIDENT: గ్యాస్ లీక్.. పెన్నా సిమెంట్ పరిశ్రమలో అగ్నిప్రమాదం - ap latest crime news
అనంతపురం జిల్లా బోయరెడ్డిపల్లి గ్రామ సమీపంలోని పెన్నా సిమెంట్ కర్మాగారంలో(FIRE ACCIDENT IN PENNA CEMENT FACTORY) అగ్నిప్రమాదం సంభవించింది. ఎల్ వన్ యూనిట్లో గ్యాస్ లీకై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
పెన్నా సిమెంట్ కర్మాగారంలో అగ్నిప్రమాదం