కోళ్ల ఫారంలో అగ్ని ప్రమాదం...భారీగా ఆస్తి నష్టం - fire_accident_in_ananthapuram_duddekunta_poultry_form
అనంత జిల్లా దుద్దెకుంటలోని ఓ కోళ్ల ఫారంలో అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుదాఘాతంతో మంటలు చెలరేగి భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు యజమాని తెలిపారు.
కోళ్ల ఫారంలో అగ్ని ప్రమాదం...భారీగా ఆస్తి నష్టం
అనంతపురం జిల్లా దుద్దెకుంటలో అగ్నిప్రమాదం జరిగింది. విద్యుదాఘాతంతో పౌల్ట్రీఫారం దగ్ధమైంది. సూర్యనారాయణ అనే రైతు తన పొలంలో కోళ్ల షెడ్ నిర్మించుకోగా... ఒక్కసారిగా ఫారంలో మంటలు చెలరేగాయి. సీజన్ కానందువల్ల అందులో కోళ్లు తక్కువగా ఉన్నాయని.. వాటికి సంబంధించిన వస్తువులు, దాణా, వ్యవసాయ పనిముట్లు మొత్తం కాలిపోయాయని యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. భారీగా నష్టం వాటిల్లిందని వాపోయారు.
TAGGED:
short circuit