అనంతపురం జిల్లా సెట్టూరు మండలం ములకలేడు ఆంధ్రా బ్యాంక్ ముందు రైతులు ఆందోళన చేపట్టారు. మిగిలిన బ్యాంకుల మాదిరిగానే వడ్డీ మాత్రమే తీసుకుని రుణం రెన్యువల్ చేయాలని కోరుతూ బ్యాంకు ముందు రోడ్డుపై బైఠాయించారు.
అసలుతో పాటు బ్యాంకులో జమ చేస్తుంటే.. దళారుల బెడద ఎక్కువైందని ఆవేదన వ్యక్తం చేశారు. కరువు కాటకాలతో అల్లాడుతున్న వారికి మరింత ఆర్థిక భారాన్ని పెంచవద్దని కోరారు. పోలీసులు ఎంత నచ్చచెప్పడానికి ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. దీంతో బ్యాంకు మేనేజర్ నరేంద్ర రైతుల వినతికి అంగీకరించటంతో వారు ఆందోళన విరమించారు.
ఆంధ్రాబ్యాంకు ముందు రైతుల ధర్నా - bank
అనంతపురం జిల్లా సెట్టూరు మండలం ములకలేడు ఆంధ్రాబ్యాంక్ ముందు రైతులు ఆందోళన చేపట్టారు. వడ్డీ మాత్రమే తీసుకుని రుణం రెన్యువల్ చేయాలని కోరుతూ బ్యాంకు ముందు బైఠాయించారు.
ములకలేడు ఆంధ్రాబ్యాంకు ముందు రైతుల ధర్నా