ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైతుల ఫిర్యాదులను పోలీసులు పట్టించుకోవడం లేదు: జేసీ ప్రభాకర్ రెడ్డి - farmer farm destroyed

farmer farm destroyed: రాష్ట్రంలో పోలీసులు రైతుల ఫిర్యాదులను పట్టించుకోవడం లేదని తెదేపా నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురంలో ఓ రైతు పొలంలోని బత్తాయి చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతు విజ్ఞప్తి చేశాడు.

jc prabhakar reddy
రైతుతో మాట్లాడుతున్న జేసీ ప్రభాకర్ రెడ్డి

By

Published : Dec 8, 2022, 5:12 PM IST

Farmer Farm Destroyed: అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం రెడ్డిపల్లిలో బాల వరదరాజులు పొలంలోని బత్తాయి చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. విషయం తెలుసుకుని తోటను తెదేపా నేత జేసీ ప్రభాకర్ రెడ్డి పరిశీలించి.. రైతును అడిగి వివరాలు తెలుసుకున్నారు. రెండు ఎకరాల్లో సంవత్సరం క్రితం రూ. 60 వేల ఖర్చుపెట్టి.. 300 మొక్కలను నాటినట్లు బాలవరదరాజులు చెప్పారు. తనకు వ్యక్తిగతంగా ఎవరూ శత్రువులు లేరన్నారు. ఇప్పటికే లక్షా ఏబైవేల రూపాయలు నష్టం వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలా జరగడం దురదృష్టకరమని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. పోలీసులు తలుచుకుంటే చెట్లు నరికి వేసిన వ్యక్తులను పట్టుకుంటారని,.. కానీ ఈ ప్రాంతంలో పోలీసులు రైతుల ఫిర్యాదులను పట్టించుకునేలా లేరని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు.

ABOUT THE AUTHOR

...view details