RRR సినిమా చూస్తూనే.. కుప్పకూలిన అభిమాని! - సినిమా చూస్తూ కన్నుమూసిన అభిమాని
అనంతపురంలో ఎస్వీ థియేటర్‌లో ఆర్‌ఆర్‌ఆర్ సినిమా చూస్తూ వ్యక్తి మృతి చెందాడు. ఆస్పత్రికి తరలించేలోగానే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం విడుదల సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సందడి చేస్తుండగా.. అనంతపురంలో మాత్రం విషాదం చోటు చేసుకుంది. అనంతపురంలోని ఎస్వీ థియేటర్‌లో సినిమా చూస్తూనై ఓ అభిమాని కుప్పకూలాడు. అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గంమధ్యలోనే మృతిచెందాడు. నగరంలోని అంబేద్కర్‌నగర్‌కు చెందిన ఓబులేసు మిత్రులతో కలిసి సినిమా చూసేందుకు వెళ్లాడు. RRR చిత్రం చూడటానికి రాత్రి నుంచి అభిమానులతో కలిసి సందడి చేసిన ఓబులేసు.. చివరకు సినిమా చూస్తూనే మృతిచెందడంతో కుటుంబ సభ్యులు, మిత్రులు కన్నీటి పర్యంతమయ్యారు.
ఇదీ చదవండి:RRR Movie: యానాంలో ఆర్‌ఆర్‌ఆర్ చిత్రాన్ని వీక్షించిన హీరో కార్తికేయ