ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కలహాలతో నలుగురు ఆత్మహత్యాయత్నం.. ఇద్దరు మృతి - గోరంట్ల

కుటుంబ కలహాలు ఇద్దరి ప్రాణాలను బలి తీసుకున్నాయి. మరో ఇద్దరు కొన ఊపిరితో ఉన్నారు. కుటుంబ కలహాలే నలుగురు ఆత్మహత్యాయత్నానికి కారణమని తెలుస్తోంది.

కలహాలతో కుటుంబం ఆత్మహత్యాయత్నం

By

Published : May 8, 2019, 12:55 PM IST


అనంతపురం జిల్లా గోరంట్లలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యాయత్నం చేశారు. కుటుంబ కలహాలతో పురుగుల మందు తాగి బలవన్మరణ యత్నానికి పాల్పడ్డారు. గోరంట్లకు చెందిన రామకృష్ణమ్మ గత కొన్నేళ్లుగా భర్తకు దూరంగా ఉంటోంది. తమ్ముళ్లు మోహన్, సోమశేఖర్​, కుమారుడు వేణుగోపాల్​తో కలిసి ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. మంగళవారం అర్ధరాత్రి సమయంలో శ్మశాన వాటిక వద్దకు వెళ్లి పురుగుల మందు తాగారు. ఆ ప్రాంతం ఊరికి దూరంగా ఉన్నందున ఉదయం వరకు ఎవరూ గుర్తించలేదు. 9 గంటల ప్రాంతంలో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. అప్పటికే మోహన్, సోమశేఖర్​లు మృతి చెందినట్లు నిర్ధరించారు. రామకృష్ణమ్మ, అతని కుమారుడిని హిందూపురం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details