మూడో దశ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో పోలీసులు బాగా పని చేశారని... తెదేపా మాజీ ఎమ్మెల్యే జేసి ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా అభ్యర్థులందరిని సమానంగా చూశారని కొనియాడారు. అనంతపురంలో ఎన్నికలు నిర్వహించిన తీరుతో పోలీసులకు మంచి పేరొచ్చిందన్నారు. జిల్లా పోలీసులకు చేతులెత్తి దండం పెడుతున్నానని వ్యాఖ్యానించారు. మున్ముందు పోలీసులు ఇలాగే వ్యవహరిస్తే మరింత మంచిపేరు వస్తుందని హితవు పలికారు.
ఎన్నికల నిర్వహణలో పోలీసులు బాగా పని చేశారు: జేసి ప్రభాకర్ రెడ్డి - JC Prabhakar Reddy comments on Police
ఎన్నికల నిర్వహణలో పోలీసులు బాగా పని చేశారని తెదేపా నేత జేసి ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. మున్ముందు పోలీసులు ఇలాగే వ్యవహరిస్తే మరింత మంచి పేరు వస్తుందని హితవు పలికారు.
Ex MLA JC Prabhakar Reddy Praised Police Election Role