అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని మార్కెట్ యార్డులో స్థానిక డీఎస్పీ ఖాసీం సాహెబ్ ఆధ్వర్యంలో మెుక్కలు నాటారు. ఉరవకొండ పోలీస్ వాలంటీర్స్, ఎస్సై సుధాకర్ యాదవ్ సహకారంతో వెయ్యి మొక్కలను నాటడమే కాక.. బిందు సేద్యం పద్ధతిలో వాటికి క్రమం తప్పకుండా నీరందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ...బాధ్యతగా తీసుకొని మెుక్కలు నాటాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.
'పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి' - ananthapur
పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ...బాధ్యతగా తీసుకొని మెుక్కలు నాటాలని అనంతపురం జిల్లా గుంతకల్లు డీఎస్పీ ఖాసీం సాహెబ్ పిలుపునిచ్చారు.
మెుక్కలు నాటే కార్యక్రమం