ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

MURDER: మద్యం మత్తులో అన్నను హత్య చేసిన తమ్ముడు - మద్యం మత్తులో అన్న హాత్య

అనంతపురంలోని ప్రియాంకనగర్​లో ఖాదర్ వలీ అనే వ్యక్తిపై.. సొంత తమ్ముడు జావీద్ హుస్సేన్ కత్తితో దాడి చేసి హత్య చేశాడు. కొంత కాలంగా కుటుంబ కలహాలతో అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు.

drunken man killed his own brother
మద్యం మత్తులో అన్న హాత్య

By

Published : Jul 2, 2021, 10:43 AM IST

మద్యం మత్తులో సొంత అన్ననే హత్య చేసిన ఘటన అనంతపురంలోని ప్రియాంకనగర్​లో జరిగింది. ఖాదర్ వలీ, జావీద్ హుస్సేన్ ఇద్దరు అన్నదమ్ములు. కారు డ్రైవర్లుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. మద్యానికి బానిసైన జావిద్ హుస్సేన్ తరచూ తన అన్నతో గొడవ పడేవాడిని స్థానికులు తెలిపారు.

గురువారం(జులై 1)న ఇద్దరి మద్య గొడవ జరిగింది. మద్యం మత్తులో ఉన్న జావిద్​ హుస్సేన్.. తన అన్న ఖాదర్​వలీపై కత్తితో దాడి చేసినట్లు బందువులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన ఖాదర్ వలీని ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇది చదవండి:

Psycho Lover: యువకుడి ఘాతుకం.. ప్రేమను నిరాకరించిందని విద్యార్థిని హత్య

ABOUT THE AUTHOR

...view details