ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వైకాపా బెదిరింపులకు భయపడొద్దు: కందికుంట

By

Published : Mar 3, 2021, 10:12 AM IST

వైకాపా నాయకుల ప్రలోభాలకు గురికాకుడదని.. బెదిరింపులకు లొంగవద్దని.. తెదేపా బాధ్యుడు కందికుంట వెంకటప్రసాద్ అభ్యర్థులకు సూచించారు. అన్యాయం జరిగితే తెదేపా ప్రజల పక్షన పోరాటం చేస్తుందని.. అనంతపురం జిల్లా కదిరిలో చెప్పారు.

Do not be afraid of threats that you will be removed from the scheme if you do not win
'ఓటేయకపోతే పథకాల నుంచి తొలగిస్తామనే.. బెదిరింపులకు భయపడొద్దు'

వైకాపాకు ఓటేయకపోతే పథకాల నుంచి తొలగిస్తామనే వాలంటీర్లు చేస్తున్న బెదిరింపులకు భయపడొద్దని తెదేపా బాధ్యుడు కందికుంట వెంకటప్రసాద్ సూచించారు. తెదేపా పాలనలో అనంతపురం జిల్లా కదిరి మున్సిపాలిటీ అభివృద్ధి చెందిందన్నారు. తెదేపా అధినేత చంద్రబాబునాయుడిపై ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఖండించారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రభుత్వంలో ఉన్నామనే దురహంకారంతో వైకాపా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు ఆరోపించారు.

అన్యాయం జరిగితే తెదేపా ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. మున్సిపాలిటీలో ఎన్నడూ జరగని విధంగా తెదేపా కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. అభ్యర్థులు వాలంటీర్లు ప్రలోభాలు, నాయకుల బెదిరింపులకు బెదరాల్సిన పనిలేదని చెప్పారు. సమావేశంలో పార్టీ మున్సిపల్ ఎన్నికల పరిశీలకుడు చంద్రశేఖర్​యాదవ్ ఆరీఫ్​ అలీ, బాబ్జాన్ పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details