అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలోని ఎమ్మార్వో కార్యాలయం ముందు ఆశావర్కర్లు తమ డిమాండ్లు పరిష్కరించాలని నిరసన చేపట్టారు. ఎమ్మార్వోకు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఆశావర్కర్ల తో పాటు సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు.
తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని కోరారు. కరోన విజృంభిస్తున్న సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న తమకు ప్రత్యేక అలవెన్స్ 10వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రక్షణ పరికరాలు సమకూర్చాలని రూ. 10000 గౌరవ వేతనం ఇస్తున్నందుకు ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో కోత విధించడం మానుకోవాలని పేర్కొన్నారు. మార్చి 17వ తేదీ తర్వాత మరణించిన ఆశాలకు బీమా సొమ్మును వారి కుటుంబాలకు చెల్లించి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్లలో తెలిపారు.
ఆశా వర్కర్లు డిమాండ్లను పరిష్కరించాలని ధర్నా - asha workers demands day
తమ డిమాండ్లను పరిష్కరించాలని ఆశా వర్కర్లు ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. కరోన విజృంభిస్తున్న సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న తమకు ప్రత్యేక అలవెన్స్10వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఆశా వర్కర్లు డిమాండ్లను పరిష్కరించాలని ధర్నా