ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిలో దేవీ నవరాత్రులు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రశాంతి నిలయంలో గాయత్రి దేవీ ఆలయం, లక్ష్మీదేవి పట్టణంలోని సత్యమ్మ కన్యకా పరమేశ్వరి దుర్గాదేవి ఆలయాల్లో దేవతా మూర్తులను ప్రత్యేకంగా స్వర్ణ కవచాలంకృత అమ్మవార్లుగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఉదయం నుంచే దేవతా మూర్తులను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. తొమ్మిది రోజుల పాటు జరిగే ఉత్సవాలను పురస్కరించుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
పుట్టపర్తిలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు - దేవీ నవరాత్రి ఉత్సవాలు
రాష్ట్ర వ్యాప్తంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అనంతపురం జిల్లాలోని ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తిలోని ప్రముఖ అమ్మవారి ఆలయాలను ప్రత్యేకంగా అలంకరించారు. తొలిరోజు స్వర్ణ కవచాలంకృత అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.
దసరా ఉత్సవాలు