ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వేరుశనగ పంటకు జింకల మంద బెడద

అనంతపురం జిల్లా మడకశిర మండలంలో వేరుశెనగ పంటలను జింకల గుంపులు నాశనం చేస్తున్నాయి. అటవీశాఖ అధికారులు వాటిని రాకుండా చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

By

Published : Aug 17, 2020, 10:34 PM IST

Published : Aug 17, 2020, 10:34 PM IST

deers destroying crops at madakasira
మడకశిర మండలంలో పంటలను నాశనం చేస్తున్న జింకల గుంపులు

అనంతపురం జిల్లా మడకశిర మండలంలో 10 వేల హెక్టార్లలో వేరుశనగ పంటను రైతులు సాగు చేశారు. ప్రస్తుతం పడుతున్న వర్షాలకు పంటలు పచ్చగా ఆశాజనకంగానే ఉన్నాయి. మండలంలోని ఆర్.అనంతపురం, గౌడనహళ్ళి, కల్లుమరి పంచాయతీ పరిధిలోని గ్రామాలలో రైతులు సాగుచేసిన వేరుశనగ పంటపై రాత్రి సమయాల్లో జింకలు గుంపులు గుంపులుగా వచ్చి పంటను నాశనం చేస్తున్నాయి.

అటవీశాఖ అధికారులు జింకల బెడద నుంచి పంటను కాపాడాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. పంట నష్టం వాటిల్లిన రైతులను గుర్తించి ప్రభుత్వ నుంచి పరిహారం వచ్చే విధంగా అధికారులు చొరవ చూపాలని రైతులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details