ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Cyber fraud: మీ షోలో కారు బహుమతి వచ్చిందంటూ..15 లక్షలు టోకరా - అనంతపురం జిల్లా సైబర్​ క్రైమ్​

Cyber fraud: అనంతపురం జిల్లా పుట్లూరుకి చెందిన వ్యక్తి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి... 15 లక్షలు పోగొట్టుకున్నాడు. మీ షోలో కారు తగిలిందంటూ... తక్కువ మెత్తంలో పొందవచ్చని నమ్మించి డబ్బులు దోచుకున్నారు. కాల్స్ వస్తే వెంటనే 1930నెంబరు కు సమాచారం అందించాలని ఎస్సై గురుప్రసాద్ రెడ్డి తెలిపారు.

Cyber fraud
సైబర్​ క్రైమ్​

By

Published : Sep 21, 2022, 2:18 PM IST

Cyber fraud: అనంతపురం జిల్లా పుట్లూరు మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి... సైబర్ నేరగాళ్ల మాయలో పడి దాదాపు రూ.15 లక్షలు పోగొట్టుకున్నాడు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మీషోలో మీకు కారు బహుమతిగా వచ్చిందంటూ మాటలు కలిపి డబ్బులు చెల్లించాలని గుర్తు తెలియని వక్తులు ఫోన్ చేశారు. ఆర్బీఐ నుంచి మాట్లాడుతున్నామని చెప్పి దాదాపు రూ.15 లక్షలను బాధితుడి నుంచి తీసుకున్నట్లు ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి తెలిపారు.

బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ప్రతి ఒక్కరు ఆఫర్​లో బహుమతులు తగిలాయని వస్తున్న అపరిచిత కాల్స్​కు ఆశ పడి డబ్బులు పోగొట్టుకూడదని ఎస్​ఐ హెచ్చరించారు. అపరిచితులు కాల్స్ వస్తే వెంటనే 1930 నెంబరుకు సమాచారం అందిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతే కాకుండా లోన్ యాప్​ల పట్ల కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏమైనా ఇబ్బందులు తలెత్తితే పోలీసుల దృష్టికి తీసుకురావాలని ఎస్​ఐ గురుప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు.

సైబర్​ క్రైమ్​

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details