ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బిస్కెట్ ప్యాకెట్ల కోసం పోతే... ప్రాణమే పోయింది! - current shock

సంతలో బిస్కెట్ ప్యాకెట్ల సంచిని ఎత్తుకెళ్లిన కోతిని వెంబడించి ఓ యువకుడు ప్రాణం పోగొట్టుకున్నాడు.

విద్యుదాఘాతం

By

Published : Jul 25, 2019, 11:26 PM IST

Updated : Jul 26, 2019, 6:11 AM IST

బిస్కెట్ల సంచి కోసం పోతే... ప్రాణమే పోయే...

అనంతపురం జిల్లా ముదిగుబ్బ పాత ఊరు పెద్దమ్మ ఆలయం వద్ద సంతలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై.. రాజు అనే యువకుడు మృతిచెందాడు. మృతుడు చిల్లర దుకాణం నిర్వహిస్తున్నాడు. అంగట్లో బిస్కెట్ల సంచి తీసుకుని ఓ కోతి... సమీపంలోని రేకుల షెడ్డు ఎక్కింది. అక్కడికి వెళ్ళిన రాజు కోతిని అదిలించే ప్రయత్నంలో.. పైన ఉన్న 11 కీవీ విద్యుత్ తీగలను తాకాడు. ఆ వెంటనే విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Last Updated : Jul 26, 2019, 6:11 AM IST

ABOUT THE AUTHOR

...view details