అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం పొట్టిపాడు లో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు ఉదయం పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి గంట వ్యవధిలోనే శవాలుగా మారారు. ఈరన్న, చంద్రలు కలిసి 6 ఎకరాలు పొలం గుత్తకు తీసుకొని మిరప పంట సాగు చేశారు. అయితే కాలవలో నీరు తగ్గడంతో... విద్యుత్ మోటర్ సాయంతో పొలానికి నీరు పెట్టాలని నిర్ణయించుకున్నారు. మోటర్లను బిగిస్తున్న సమయంలో విద్యుత్ షాక్కు గురై మృతి చెందారు.
విషాదం..విద్యుదాఘాతంతో అన్నదమ్ములు మృతి - current
పొలానికి నీళ్లు పెట్టేందుకు...మోటారు బిగించే క్రమంలో విద్యుతాఘాతానికి గురై అన్నదమ్ములు మృత్యువాతపడిన ఘటన అనంత జిల్లా పొట్టిపాడులో జరిగింది.
విద్యుదాఘాతం... ఇద్దరు అన్నదమ్ములు మృతి