ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైతులకు నష్ట పరిహారం వెంటనే చెల్లించాలి: సీపీఎం - ప్రభుత్వానికి వ్యతిరేకంగా సీపీఎం నినాదాలు

అనంతపురం రైతులకు మద్దతు పలికారు సీపీఎం నేతలు. వర్షాలతో నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించాలని కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేశారు.

cpm protest at anantap collectorate  for farmers
రైతులకు నష్ట పరిహారం వెంటనే చెల్లించాలి: సీపీఎం

By

Published : Nov 2, 2020, 4:31 PM IST

వర్షాలతో నష్టపోయిన పంటలకు వెంటనే పరిహారం చెల్లించాలని అనంతపురం జిల్లా కలెక్టరేట్ వద్ద సీపీఎం నాయకులు ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంత్రి బొత్స సత్యనారాయణకు వినతిపత్రం ఇవ్వాలని ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో సీపీఎం నేతలు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. న్యాయబద్ధంగా వినతి పత్రం ఇస్తామంటే అడ్డుకోవటం ఏమిటని సీపీఎం నేతలు ప్రశ్నించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేసినవారిని పోలీసులు అరెస్టు చేశారు.

ABOUT THE AUTHOR

...view details