దేశంలో వెనుకబడిన ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ మొండిచేయి చూపిందని సీపీఎం పార్టీ నాయకులు మండిపడ్డారు. అనంతపురంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను సీపీఎం నాయకులు దహనం చేశారు. మొదట టవర్ క్లాక్ సమీపంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మతో నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. దిష్టిబొమ్మను దహనం చేసే సమయంలో పోలీసులు, సీపీఎం నాయకుల మధ్య తోపులాట జరిగింది. సీపీఎం నాయకులు గట్టిగా నినాదాలు చేస్తూ.. తల లేని కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఇది కేంద్ర బడ్జెట్ కాదు.. కార్పొరేట్ బడ్జెట్: సీపీఎం - cpm rally
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ను వ్యతిరేకిస్తూ సీపీఎం నాయకులు అనంతపురంలో తలలేని దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ బడ్జెట్ కేవలం కార్పొరేట్ బడ్డెట్... దీనిని వ్యతిరేకించండి అని నినాదాలు చేశారు.
దిష్టి బొమ్మను దహనం చేస్తున్న సీపీఎం నాయకులు