CPI agitation on Special status : ప్రత్యేక హోదా విభజన హామీల అమలు చేయాలని అనంతపురంలోని ఆర్డీవో కార్యాలయం వద్ద సీపీఐ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. కార్యాలయం ముందు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు, విశాఖ ఉక్కు అంశంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. నరేంద్ర మోదీకి.. ముఖ్యమంత్రి జగన్ తొత్తుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రజల కష్టాలను గాలికి వదిలేసి అదానీ, అంబానీలకు లబ్ధి చేకూర్చే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. విభజన హామీలు ప్రత్యేక హోదా ఇవ్వాలని.. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలి: సీపీఐ - అనంతపురం తాజా వార్తలు
Special status : అనంతపురంలోని ఆర్డీవో కార్యాలయం వద్ద సీపీఐ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా విభజన హామీల అమలు చేయాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ. విభజన హామీలు ప్రత్యేక హోదా ఇవ్వాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.
సీపీఐ నాయకులు ధర్నా