ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మంత్రి బొత్సకు సీపీఐ నేత రామకృష్ణ సవాల్ - అమరావతి రైతుల ఆందోళన తాజా వార్తలు

మూడు రాజధానులపై ప్రజాభిప్రాయసేకరణకు సిద్ధమా అని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ సవాల్ విసిరారు. ప్రభుత్వ నిర్ణయానికి మద్దతుగా ఒక్క ఓటు వచ్చినా అమరావతి ఊసే ఎత్తమని స్పష్టం చేశారు.

cpi ramakrishna
cpi ramakrishna

By

Published : Oct 12, 2020, 6:28 PM IST

అమరావతిలో 300 రోజులుగా సాగుతున్న ఉద్యమంపై అవహేళనగా మాట్లాడుతున్నారంటూ మంత్రి బొత్స సత్యనారాయణపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. ఎంత మంది బెదిరించినా.. ఎవరెన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నా.. అక్కడి ప్రజలు 300రోజులుగా నిరసన చేస్తున్నారని ఆయన అనంతపురంలో అన్నారు. రాష్ట్ర ప్రజలు మూడు రాజధానులకే మద్దతు తెలుపుతున్నారని మంత్రి బొత్స చెప్పిందే నిజమైతే.. 13 జిల్లాల్లో ప్రజాభిప్రాయసేకరణకు సిద్ధమా అని రామకృష్ణ సవాల్ విసిరారు.

మూడు రాజధానులకు మద్దతుగా ఒక్క ఓటు ఎక్కువగా వచ్చినా.. అమరావతి పేరే ఎత్తమని అన్నారు. మరోవైపు అనంతపురం, కర్నూలు జిల్లాల్లో వర్షాలకు జరిగిన పంటనష్టాన్ని ముఖ్యమంత్రి జగన్ స్వయంగా పరిశీలించి రైతులకు పరిహారాన్ని ఇవ్వాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన స్పందించి పంట నష్టంపై వివరాలు సేకరించాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details