ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తీరుపై సీపీఐ అనంతపురం జిల్లా కార్యదర్శి జగదీష్ మండిపడ్డారు. అనంతపురం జిల్లా గుంతకల్లు సీపీఐ కార్యాలయంలో మాట్లాడిన ఆయన జేసీ చేసిన వ్యాఖ్యలు అహంకారపూరితంగా ఉన్నాయన్నారు. ప్రజల ఓట్లతో గెలిచిన ఆయన...ప్రజల్ని అవమానపరిచేలా మాట్లాడడం సరికాదని హితవుపలికారు. తక్షణమే ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోరారు. సార్వత్రిక ఎన్నికల్లో జేసీ 50 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. ఎన్నికల సంఘం ఆయనపై చర్యలు తీసుకోకపోతే కోర్టును ఆశ్రయిస్తామని జగదీష్ అన్నారు.
జేసీ వ్యాఖ్యలపై ఈసీ చర్యలు తీసుకోవాలి: సీపీఐ - jc diwakar reddy
రాయలసీమలో కూటికి గతిలేని వారు కూడా ఓటుకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సీపీఐ అనంతపురం జిల్లా కార్యదర్శి జగదీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీపీఐ నేత జగదీష్