ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కరోనాతో మహిళ మృతి..ఖననానికి గ్రామస్థుల అభ్యంతరం

By

Published : Jul 20, 2020, 11:25 PM IST

అయిన వారిని కోల్పోయి కొండంత దుఃఖంతో ఉన్న కరోనా మృతుల కుటుంబాలకు.. వారి అంత్యక్రియలు మరింత గుండెకోతను మిగిలిస్తున్నాయి. ప్రజల మూఢ నమ్మకాలతో.. అసలే బాధలో ఉన్న కరోనా మృతుల కుటుంబసభ్యులకు అంత్యక్రియలు నిర్వహిస్తున్న తీరు.. వాటిని అడ్డుకుంటున్న గ్రామస్థుల నిరసనలు తీవ్ర శోకాన్ని కలిగిస్తున్నాయి.

covid died lady crimation
covid died lady crimation

అనంతపురం జిల్లా గుంతకల్లులో కరోనాతో మృతి చెందిన ఓ మహిళ మృతదేహాన్ని వాల్మీకి నగర్ శ్మశాన వాటికలో ఖననం చేసేందుకు తీసుకొచ్చారు. అక్కడ మృతదేహాన్ని ఖననం చేయడానికి వీళ్లేదంటూ... ఆ ప్రాంత ప్రజలు శ్మశానవాటికకు అడ్డుగా నిరసన చేపట్టారు. అధికారులు ఎంత నచ్చజెెప్పినా వినలేదు. కావాలంటే అధికారులు ఊరికి దూరంగా ఎక్కడైనా ఆ కార్యక్రమం పూర్తి చేయాలని వాదనకు దిగారు. చేసేదేమీ లేక అధికారులు మృతదేహాన్ని మరో మైదానానికి తరలించారు.

మృతురాలి కుటుంబ సభ్యులు ఈ విషయం తెలిసి ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం సాయంత్రం చనిపోయిన తమ తల్లి అంత్యక్రియలు ప్రభుత్వమే నిర్వహిస్తుందని కమిషనర్ వెల్లడించడంతో పరిస్థితి అర్థం చేసుకున్నామని తెలిపారు. కానీ ఈరోజు ఖననాన్ని కాలనీ వాసులు అడ్డుకోవడం చాలా బాధగా ఉందని అన్నారు.

ఇదీ చదవండి:రేపు అమూల్​ సంస్థతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం

ABOUT THE AUTHOR

...view details