కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా పెండింగ్ కేసులను పరిష్కరించేందుకు న్యాయస్థానాలు వర్చువల్ లోక్ అదాలత్‌లు నిర్వహిస్తున్నాయి. అనంతపురం జిల్లా కదిరిలో మండల న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్ వెంకటేశ్వరరావు, న్యాయమూర్తులు, కోర్టు సిబ్బంది నిర్వహించిన వర్చువల్ లోక్ అదాలత్‌లో రాజీకి అవకాశమున్న 27 కేసులు పరిష్కారం అయ్యాయి. కక్షిదారులు ఎస్ఎంఎస్, ఈమెయిల్, వాట్సాప్ మాధ్యమాల ద్వారా తమ అంగీకార పత్రాన్ని న్యాయస్థానాలకు పంపారు. వాటిని పరిశీలించిన న్యాయమూర్తులు వర్చువల్ విధానం ద్వారా రాజీకి వీలైనా కేసులను పరిష్కరించినట్లు తెలిపారు.
వర్చువల్ లోక్ ఆదాలత్ ద్వారా కేసుల పరిష్కారం
న్యాయస్థానాలు పెండింగ్ కేసులను పరిష్కరించేందుకు వర్చువల్ లోక్ ఆదాలత్‌లు నిర్వహిస్తున్నాయి. వీటి ద్వారా కదిరిలో 27 కేసులు పరిష్కారమయ్యాయి.
వర్చువల్ లోక్ ఆదాలత్‌ల ద్వారా కేసుల పరిష్కారం
ఇదీ చదవండి:పండుగ రోజుల్లో... రైళ్ల మాటేంటి..?