అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని కరణం చిక్కప్ప ఉన్నత పాఠశాలలో ఓ జూనియర్ అసిస్టెంట్‌కు, ఏడవ తరగతి విద్యార్థినికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దాంతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు భయాందోళనలకు గురయ్యారు.
పాఠశాలలో ఇద్దరికి కరోనా పాజిటివ్.. భయాందోళనలో తల్లిదండ్రులు - అనంతపురం జిల్లా వార్తలు
కళ్యాణదుర్గం పట్టణంలోని కరణం చిక్కప్ప ఉన్నత పాఠశాలలో కరోనా కలకలం రేగింది. ఓ జూనియర్ అసిస్టెంట్‌కు, విద్యార్థినికి కరోనా సోకింది. వెంటనే అధికారులు అప్రమత్తమై..విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కరోనా పరీక్షలు నిర్వహించారు.
పాఠశాల
డీఈవో సూచనల మేరకు రెండు రోజులు పాఠశాలకు సెలవు ప్రకటించినట్లు హెచ్ఎం శ్రీదేవి వెల్లడించారు. ఈ రోజు పాఠశాలలో ఉపాధ్యాయులకు, విద్యార్థుల కరోనా పరీక్షలు చేసి శాంపిల్స్ సేకరించినట్లు డాక్టర్ సుస్మిత తెలియజేశారు.
ఇదీ చదవండి:CORONA: రాష్ట్రంలో కొత్తగా 1,445 కరోనా కేసులు.. 11 మరణాలు