ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనాపై అవగహన కల్పిస్తూ ఆటో ర్యాలీ

కరోనా వైరస్ రోజురోజుకు విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కరోనా ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు సూచించారు. కరోనాపై అవగాహన కల్పిస్తూ అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో ఆటోర్యాలీ నిర్వహించారు.

కరోనాపై అవగహన కల్పిస్తూ ఆటో ర్యాలీ !
కరోనాపై అవగహన కల్పిస్తూ ఆటో ర్యాలీ !

By

Published : Jul 31, 2020, 11:43 AM IST

కరోనాపై అవగాహన కల్పించేందుకు అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో కరోనా ఎన్​ఫోర్స్​మెంట్ అధికారుల ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. అనంతరం వస్త్రదుకాణాల సహకారంతో ఆటోడ్రైవర్లకు ప్రయాణికులకు అడ్డుగా ఉండే తెరలను పంపిణీ చేశారు. ఆటో ఎక్కేముందు ప్రతి ప్రయాణికుడు మాస్కు ధరించేలా చూడాలని అధికారులు డ్రైవర్లకు సూచించారు. వైరస్ రోజురోజుకు విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details