అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన శ్రీనివాసులు డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఉద్యోగరీత్యా 5 రోజుల క్రితం తిరుపతికి వెళ్లి వస్తుండగా గుత్తి పట్టణంలో దిగి తలకు రాసుకునే రంగు తాగాడు. గమనించిన స్థానికులు శ్రీనివాసులును హుటాహుటిన గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అదే సమయంలో జిల్లా కలెక్టర్ సత్యనారాయణ ఆకస్మిక తనిఖీలో భాగంగా గుత్తి ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ శ్రీనివాసులు పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం కలెక్టర్, సిబ్బంది కలిసి శ్రీనివాసులును అనంతపురం ప్రభుత్వాసుపత్రికి గురువారం రాత్రి అంబులెన్స్‌లో పంపించారు. అయితే అనంతపురం ఆసుపత్రికి చేరుకున్నాక వైద్యులు గంట పాటు సరైన వైద్యం అందించలేదని, వైద్యుల అలసత్వం వల్ల తమ వ్యక్తి చనిపోయాడని బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు. సంబంధిత వైద్యుణ్ని సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. వైద్యులు మాత్రం బంధువుల ఫిర్యాదు మేరకే చికిత్స అందించామని చెప్పుకొచ్చారు. ఆందోళన చేస్తున్న బంధువులను పోలీసుల ప్రమేయంతో ఆందోళన విరమింపజేసేలా చేశారు.
ప్రభుత్వాస్పత్రి ఎదుట మృతుని బంధువుల ఆందోళన - govt hospital
అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల తమ వ్యక్తి చనిపోయాడని మృతుని బంధువులు ఆందోళన చేపట్టారు.
వైద్యుల నిర్లక్ష్యంతో మరణించాడని బంధువుల ఆరోపణ