పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానిపై అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణ పోలీస్ స్టేషన్లో భాజపా నాయకులు ఫిర్యాదు చేశారు. హిందూ దేవుళ్లను అగౌరవపరిచే విధంగా మంత్రి వ్యాఖ్యలు ఉన్నాయనీ, ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మంత్రిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ.. ధర్మవరం పట్టణ సీఐ కరుణాకర్‌కు ఫిర్యాదును అందించారు.
మంత్రి కొడాలి నానిపై ధర్మవరం ఠాణాలో ఫిర్యాదు - dharmavaram bjp leaders news
అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో మంత్రి కొడాలి నానిపై.. భాజపా నేతలు ఫిర్యాదు చేశారు. మంత్రిపై చర్యలు తీసుకోవాలని సీఐని కోరారు.
మంత్రిపై భాజపా నేతల ఫిర్యాదు