ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాగలి పట్టి.. పొలం దున్నిన కలెక్టర్​ - అనంతపురం జిల్లాలో ఏరువాక తాజా వార్తలు

రైతులకు అత్యంత ముఖ్యమైన కార్యక్రమం ఏరువాక. ఇందులో అనంతపురం జిల్లా కలెక్టర్​ గంధం చంద్రుడు కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. భావితరాలకు వ్యవసాయ ప్రాముఖ్యతను తెలియజేయడానికే కుటుంబ సభ్యులతో కలిసి ఏరువాకలో పాల్గొన్నట్లు ఆయన తెలిపారు.

collectore visited eruvaka
ఏరువాక కార్యక్రమాన్ని పరిశీలించిన కలెక్టర్

By

Published : Jul 5, 2020, 9:16 PM IST

Updated : Jul 18, 2020, 6:15 PM IST


అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం మర్తాడు గ్రామంలో కలెక్టర్ గంధం చంద్రుడు ఏరువాక కార్యక్రమాన్ని పరిశీలించారు. విత్తన గొర్రు ద్వారా విత్తనాలు ఎలా విత్తుతారు అనే విషయాన్ని రైతులను అడిగి తెలుసుకున్నారు.

నేటి యువతరానికి వ్యవసాయం ప్రాధాన్యత విలువలను తెలపడం కోసమే కుటుంబ సభ్యులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. గ్రామంలోని వర్షాభావ పరిస్థితులపై రైతులతో చర్చించారు.

Last Updated : Jul 18, 2020, 6:15 PM IST

ABOUT THE AUTHOR

...view details