అన్నదాత ఆక్రందనలపై అధికారుల స్పందన - anathpuram
సాగు కాలం వచ్చినా అన్నదాతకు విత్తనాలు అందక అల్లాడిపోతున్నాడు. దళారీల దగ్గర కొనగోలు చేసిన విత్తనాలు నాసిరకం అని తెలిసి ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు ప్రస్తుతం వేరుశనగ రైతులు. రైతుల సమస్యలపై అసలు అధికారుల స్పందనేంటి?
అన్నదాత ఆక్రందనలపై అధికారుల స్పందన
అనంతపురం జిల్లాలో వేరుశనగ విత్తనాలను సకాలంలో రైతులకు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ సత్యనారాయణ చెప్పారు. గతేడాది కరవు కారణంగా ఈ ఏడు విత్తనాలకు డిమాండ్ పెరిగిందని అన్నారు. సమస్యను అధిగమించేందుకు పొరుగు రాష్ట్రాల నుంచి విత్తనాలు దిగుమతి చేస్తున్నామంటున్న కలెక్టర్ సత్యనారాయణతో మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ ముఖాముఖి.