ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కాంట్రాక్టు, ఔట్​సోర్సింగ్ ఉద్యోగులకు బీమా ప్రకటించాలి'

లాక్​డౌన్​ సమయంలో వైద్య, ఆరోగ్య, పోలీస్​ శాఖల్లో పనిచేసే ఉద్యోగులకు ప్రభుత్వం రూ. 50 లక్షల బీమా ప్రకటించింది. వారికి మాదిరిగానే అంగన్​వాడీ వర్కర్స్​, ఔట్​సోర్సింగ్​ ఉద్యోగులకు ఆ సౌకర్యం కల్పించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అనంతరం పెనుకొండ తహసీల్దార్​కు వినతిపత్రం అందించారు.

citu protest in penukonda ahsildar office
పెనుకొండ తహసీల్దార్​కు వినతిపత్రం అందజేస్తున్న సీఐటీయూ నాయకులు

By

Published : May 15, 2020, 3:37 PM IST

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ ప్రభుత్వం... వైద్య, ఆరోగ్య, పోలీస్ శాఖల్లో పనిచేసే ఉద్యోగులకు రూ.50 లక్షలు బీమా ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రాణాలు సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్న అంగన్​వాడీ వర్కర్స్, కాంట్రాక్ట్, ఔట్​సోర్సింగ్​ ఉద్యోగులకూ బీమా సౌకర్యం కల్పించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రమేష్ కోరారు. గురువారం పెనుకొండలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆలిండియా కమిటీ పిలుపు మేరకు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్ నాగరాజుకి వినతి పత్రం అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details