కార్యకర్తలపై దాడులను సహించేది లేదు: చంద్రబాబు - ycp
కార్యకర్తలపై దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. నేరాలు, ఘోరాలు, హత్యలను ప్రజలెప్పుడూ ఒప్పుకోరని.. వైకాపా ఆ విషయాన్ని గ్రహించాలని సూచించారు.
babu
అనంతపురం జిల్లాలో తెదేపా అధినేత చంద్రబాబు పర్యటించారు. హత్యకు గురైన తెదేపా కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించారు. అన్ని గ్రామాలకు తిరిగి కార్యకర్తలను కాపాడుకుంటానన్న చంద్రబాబు....అవసరమైతే పరిస్థితులు చక్కబడే వరకూ అక్కడే ఉంటానని తెలిపారు. వైకాపా అన్యాయంగా తప్పుడు కేసులు పెట్టి వేధించడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు.