అనంతపురం జిల్లా ధర్మవరంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. జిల్లాలోని సుందరయ్య నగర్లో... పోస్టల్ ఉద్యోగిని చంద్రకళ... కాలినడకన ఇంటికి వెళ్తుంది. అటువైపుగా ద్విచక్ర వాహనంలో వచ్చిన చైన్ స్నాచర్లు ఆమె మెడలో ఉన్న 6 తులాల బంగారు గొలుసును బలవంతంగా లాక్కెళ్లారు. ద్విచక్రవాహనంపై నుంచి చైన్ లాగడంతో చంద్రకళ కింద పడగా... తలకు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం బాధితురాలిని ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
మహిళ మెడలోని బంగారు గొలుసు అపహరణ - అనంతపురం జిల్లా ధర్మవరంలో దొంగతనం వార్తలు
అనంతపురం జిల్లా ధర్మవరంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. సుందరయ్య నగర్లో రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న పోస్టల్ ఉద్యోగిని మెడలో నుంచి... ఆరు తులాల బంగారు గొలుసును ద్విచక్రవాహనంపై వచ్చిన దుండగులు ఎత్తుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సుందరయ్య నగర్లో చైన్ స్నాచింగ్.. మహిళ మెడలో ఉన్న బంగారం అపహరణ