పుట్టపర్తిలో ఆషాడ ఏకాదశి వేడుకలు - అనంతపురం
ఆషాడ ఏకాదశి పర్వదిన వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సత్యసాయి భక్తులు వేదపఠనంతో వేడుకల్ని ప్రారంభించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఆషాడ ఏకాదశి పర్వదిన వేడుకలు ఘనంగా ప్రారంభయ్యాయి. మహారాష్ట్ర, గోవా రాష్ట్రాలకు చెందిన సత్యసాయి భక్తులు ప్రతిఏటా ఈ వేడుకలను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. వేదపఠనంతో వేడుకల్ని ప్రారంభించి.. సాయి కుల్వంత్ మందిరంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మహారాష్ట్ర బాలవికాస్ విద్యార్థులు ప్రదర్శించి సంప్రదాయ నృత్యాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. వేలాది మంది భక్తులు, సాయి విద్యార్థులు ఆలపించిన సత్యసాయి గీతాలు ఆహుతులను అలరించాయి.
ఇదీ చూడండి :ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలుంటే ఓటు హక్కు రద్దు'